Wednesday, 25 January 2012

మదమెక్కిన మెంటల్ బాలయ్య

   పిచ్చి ముదిరి మెడకు సుట్టుకున్యాదంట అట్లుంది ఈ మెంటల్ బాలయ్య డైలాగ్స్. ఆ తొడ కొట్టడం ఏంది మీసం తిప్పడం ఏంది ? ఇదేమన్న్య సినిమానా ? బుర్రలో పురుగులు తిరుగతన్యాయా ఏంది ఈ మెంటల్ బాలయ్యకి? రేపు నీవు గెలిచ్చే ఏమ్ సేచ్చావో అది సెప్పుగాని ఈ తొడకొట్టేది మీసాలు తిప్పేదేంది అర్థం గాక అడుగుతా మెంటల్ బాలయ్య నిన్ను? నిన్నెట్టా బరిచ్చనాడు ఈ సెంద్రబాబు? నీకన్నా సిన్నోడు బుడ్డోడయినా ఆ జూ|| యన్.టి.ఆర్ సానా బెట్టర్ అనుకొంటా? మాటల్లొ స్పస్టత, తడుబాటులేకున్యా మాట్లాడతాడు. నీవు ముందు పోయి సరిగ్గా మాట్లాడటం నేర్చుకోపో మెంటల్ బాలయ్య.


   అయినా నాకు తెలీక అడుగుతా  ఎవ్రన్న వాళ్ళు పవర్‌లోకి వస్చే ఏం జేస్చారో అని సెప్తారు గాని నీవేంది ఊరికే తొడలు కొట్టడం మీసాలు తిప్పడం ఇప్పుడేమైంది నీ రోసానికి? కొట్కోని కొట్కోని నీ తొడలు వాయిలా? విగ్గులేకుండా బయటకు రాలేవుగాని మీసాలు తిప్పడం ఒకటి నీ మొహానికి. అసలు ఏం మాట్లాడ్తానావో నీకేట్లా అర్థం గాదుకాని నీ సుట్టుపక్కలున్నోళ్ళకు ఏమన్న అర్థమయితాందా అని?  అవును సామి పోయి పోయి సిరంజీవి మీద పన్న్యావే ఏంది కథ? ఇప్పటివరకు ఆయప్పను రాష్ట పెజలంతా మర్సిపోయినారు నీవొచ్చి ఆయప్ప పేరు ఊరికే అంటాంటే అందరికీ మళ్ళా సిరంజీవి మనసి ఒకడున్నాడు అని గుర్తుకు వొస్చాంది..?  ఇప్పుడు ఆయప్పతో నీకేందిపని? పార్టీని నడిపేది సేతకాక ఇంగో పార్టిలోకి మారిపోయినోడు గురించి నీకెందుకు, నీ పార్టి సంగతి, గెలిస్చే నీవేం సేస్చావో అది సెప్పుకోవాలి. పెజలను ఎట్లా మంచి సేసుకోవాలో అది సూస్కోనేదిల్యా?


  అవునుగానీ  పెద్దాయన యన్.టి.ఆర్ మహానుభావుడుతో ఎవరు పోల్చినారు సిరంజీవిని? సిరంజీవి ఏమన్న అన్యాడా పెద్దాయన్ని? నీకేమన్న మదమెక్కిందా ఏంది ? ఎట్లా మాట్లాడాల్నో ఏమి మాట్లాడాల్నో కూడ తెల్దా నీకు? ఇట్టాంటొడికి సెంద్రబాబు పార్టి పగ్గాలు ఎట్లా అప్పగిస్చినాడు ?  కాలిగోటికి కూడ సరిపోడా? అసలు నీకు ఆ పెద్దాయన యన్.టి.ఆర్ పేరు ఉచ్చరించడానికి కూడ అర్హత లేదు అట్టాంటి మెంటల్ సన్నాసివి నీవు పోయి మరొకర్ని తిడతావా బుద్దుందానీకు? పాపం పెద్దాయన యన్.టి.ఆర్ ఏ జన్మలో ఖర్మ సేసుకొన్యాడోగానీ నీలాంటి మెంటల్‌నాయల్లు కొడుకులుగా పుట్టినారు ఆయప్ప కడుపున! శ్రీరామరాజ్యం సిన్మాసేసినావు కదా అని రోంత మర్యాదుండే నీపైనా అది గూడ నీ మెంటల్ తిట్లతో పోయింది. ఆ సిన్మాలో రాముడెంత సౌమ్యుడో అర్థం కాలేదా నీకు అట్లా పాత్ర సేసి కూడ ఇట్లా ఎట్లా మాట్లాడ్తానావు మెంటల్? నీ మెంటల్ డైలాగ్స్‌తో పెద్దాయన యన్.టి.ఆర్ పేరు సెడగొడ్తనావు. పని పాట లేక ఒక మూల్న పడున్యా సిరంజీవిని నీవే ఊరికూరికే మాట్లాడి  ఆయప్పకు లేని గొప్ప పేరును తెస్చనావు, అర్థం కాలే నీకు? నీ తిట్లతో సిరంజీవి మీద సానుభూతి వస్చాంది మాకు తిక్క బాలయ్య.


 అది సరేగాని ఆడయాడ్నో నీ అభిమానుల మీద సేయి సేసుకొన్యావంట పాపం అభిమానించిన పాపానికి వాళ్ళ సెంప సెళ్ళుమనిపించినావా? నీలాంటి మెంటలోడు ముఖ్యమంత్రి అయితే ఆ కాంగ్రెస్స్‌లో ఉండి మంత్రి పదవి ఊడిపోయిన శంకర్రావు లాగ నీకు తిక్క పుట్టి నీ పి.ఏ ల మీద సెక్రటరీల మీద సేయి సేసుకోంటావేమో కదా? నీలాంటోడికి పవర్ అవసరమా..?


  పాపం మెతక మనిషి సిరంజీవి మీద తొడకొట్టి మీసం మెలస్చానావు గాని నీకు ధైర్యముంటే అదే సేత్తొనే  "జగనన్న" మీద తొడకొట్టి మీసం మెలెయ్యి సూద్దాం? అట్లనే మావూరికి వొస్చినాక తొడ కొట్టి మీసం మెలెయ్యి సూస్చాం అప్పుడుంటాది నీ కథ నా సామిరంగ అప్పుడెప్పుడో కర్నూల్లో కె.ఇ.కృష్ణమూర్తి నీకు సుక్కలు సూపించిండ్లా అట్లా మల్లా సూస్చావు సుక్కలు.