Saturday 11 June 2011

ఈ మెంటలోడు కాబోయే ముఖ్యమంత్రట ?


  నిన్న బాలయ్యబాబు పుట్టిన రోజున పెద్ద ఆర్భాటం సేసినారు గాని, ఇట్లా ఫంక్షన్స్ జరిగినప్పుడంతా ’బాలయ్య జిందాబాద్, బాలయ్య సి.ఎమ్ ’ అని అరుచ్చాఉంటారు. తర్వాత ఆ ఊసే ఉండదు ఏందో ! అరుచ్చారెగాని ఆచరణ లేదా ? అయినా ఈ మెంటల్ సామికి ముఖ్యమంత్రి పదవేందబ్బా? నిజంగా అంత సీన్ వుందా అని? అసలు సినిమాలలో పెద్దగొప్ప కాకపోయినా ఏదో ఒకమాదిరిగానన్నా నటుడు అనిపించుకున్యాడా?  లేదే  ఆ డైలాగులేందో, ఆ అరుపులెందో ఒక్క మాట కూడ నోట్లోంచి సరిగ్గా రాదే. పైన ఫోటోలో ఉండే ఆ ముఖానికి రంగు సూడబా ఎట్లా ఉందో పగటేషగాడిలాగ, అయినా ఆ విగ్గేంది? అట్లా వుంది, పిల్లకాయలు సూచ్చే జడ్సుకోని సచ్చారు. బాలయ్య విగ్గకన్నా జోకరేషాలేస్చాడే వేణుమాదవ్ యాక్టర్ సేసే పేరడి  ’అపరిచితుడు’విగ్గు సూపర్ ఉంటాదబ్బ. పాపం నా మాటలకు బాలయ్య యీరభిమానులకు రోశమొచ్చాందేమో, రోషం కాదయ్య కావాల్సింది ’పరఫెక్ట్‌నెస్ ’ కావాలి. ఇన్నేండ్లయినా ఇంగా యాక్టింగ్ సేయడం సరిగ్గా నేర్చుకోల్యా ఇంగెందుకు బతుకు?
    
  సినిమా షూటింగులలో ఈ బాలయ్య పెద్ద తిక్కలోడంటనే నిజమేనా? మావూరోడు ఒకడు ఆ సినిమాలో పన్జేశ్చానాడులే, వాడు బో సెప్తావుంటాడు సినిమా బాతాఖానీ అదీ ఇదీ అని అట్లా ఇన్నా ఈ బాలయ్య సిత్రాలు. పొద్దున్నే షూటింగ్‌ మొదలుపెట్టడానికి ఈ బాలయ్య బాబు గారే ముహుర్తం పెడ్తాడంట. ఆ ముహుస్తానికే కెమెరా స్టార్ట్ సేయాలంటబ్బ, ఆ టయానికల్లా అందరు వచ్చిండాలంట, మల్లా ఏ రోజు ముహుర్తం ఆరోజు సపరేట్‌గా ఉంటాదంట. అయ్య గారు పొద్దున్నే షూటింగ్ స్పాట్‌కి వచ్చి వచ్చి కారు దిగంగానే ఎవ్రూ ఎదురు రాకూడదంట, ఎదురుగా కూడ ఎవ్రూ నిలబడి వుండకూడదంట అట్లా తెలీక ఎవ్రున్న వుంటే ఎగెచ్చి ఎగిచ్చి కాల్తో తంతాడంట, ఇదేమి మెంటలబ్బా అనుకున్యా.. బో యిడ్డూరం అనిపించాలా? ఇంగ షూటింగులో ఈ బాబు గారిని ఒక అర్థ గంట కూడ ఖాలీగా కూర్చోబెట్టందంట,  నా సామిరంగా షూటింగు ఉసిపోకుండా తీస్చానే ఉండాలంట, అట్లా తీయకుండా ఊరికే వేయిట్ సేయినిస్తే ఇంగ సూసుకో బూతులు తిడ్తా ఉంటాడంట, అవి కూడ ఎవ్రుకి అర్థం కావంట! ఏం మాట్లాడ్తానాడో, ఏం అరుచ్చనాడో స్పష్టంగా అర్థం కావంట. అదెదో నోట్లో  ’రాయి’ పెట్టుకొని మాట్లాడినట్లుగా బో..బొ హట్ హో అర్థం కాని అరుపులతో జగ్గనక జగ్గనకని ఎగుర్తాడంట. ఆ ఎగుర్లు చూసి సెట్లో ఉండేవాళ్ళంతా అందరూ గజ గజ వణుకుడే అంట. ఇంగ సెట్లో షాట్ అయిపోయినాక బయటకు వస్చేటప్పుడు ఎవ్రూ ఆయనకి ఎదురుగా ఉండ కూడదంట. రాకూడదట ఎవ్రున్న తెలీక వచ్చినారనుకో అంతే ఎగెచ్చి ఎగెచ్చి కాల్తో తంతాడంట, పాపం అసిస్టెంట్ డైరెక్టర్స్ బాలయ్య బాబుతోతన్నులు తినకుండా ఉన్నోళ్ళు ఎవ్రూ లేరంట. ఎవుర్నిబడ్తె వాళ్ని కొడ్తాడంట, డైరెక్టర్ అని ల్యా నిర్మాత అని ల్యా కోపమొస్తే అందర్నీ ఒకలాగే కొడ్తాడంట అందులో రిజర్వేషన్స్ ఏమి వుండవంట. ఇంత మెంటలా మనిషికి అనుకున్యా. పోనీలే అని యాక్టింగి సూద్దామంటే అబ్బో బరించలేని అరుపులు ముఖంలో ఎవరికీ తిరగని విదంగా కవలికల్ని ముప్పై వంకర్లు తిప్పుతాడు అదే ఆయన దృష్టిలో ’గొప్ప ’ నటన. పోనీ డవులాగలన్న స్పష్టంగా ఉంటాయంటే అది ల్యా ఏందో బౌ భౌ అరిచినట్టుగా ఉంటాది. అట్లనే డ్రస్ అన్నా బాగుంటాదా అంటే అది కూడ ’బుడబుక్కలోడు ’ డ్రస్సులు వేసుకొని వుంటాడు. సూడలేమబ్బా ఈ బుడబుక్కలోడిని. ఒకప్పుడు ఈ మనిషేమో అందగాడే కాని చేష్టలే బాబోయ్ బరించలేము. ’ఆకార పుష్టి నైవేద్య నష్టి ’సామెతకు నిలవెత్తునిదర్శనం ఈ బీబత్స నటనాంకితుడు. ఆ బీబత్స నటనతో ఆయన అభిమానులన్న అలరిస్తున్నాడా అంటే ఏమో? ఆ బీబత్స అభిమానుల్నే అడగాల.
    పోనీ పక్కన సినిమాలన్నా సూచ్చాడంటే అది కూడ ల్యా. బయట లోకంలో ఏం జరుగుతాంది ఏమి టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యింది, ఎట్లాంటి కొత్త కొత్త కథలొచ్చనాయి, యాక్టింగులో ఎవ్రెవరూ ఎట్లా సేచ్చనారూ తెలుసుకునే ఙ్ఞానం కూడా లేదు. ఆయన సేసిందే గొప్ప నటన అనుకొని పక్కన సేరి చేసే భజనరాయుల్లతో ఆనందపడ్తనాడేమో? మీ నాయన కథ వేరబ్బా ఆయన మహానుభావుడు, గొప్ప నటుడు, సత్తా వుండేటోడు ఆయన కడుపును మీరెట్లా పుట్టినారబ్బా ’పండిత పుత్ర పరమ శుంఠ ’ సూక్తిని నిజం సేసినారు కదా!

   ఇంగ రాజకీయ విషయాలకొస్తే. లాల్ హ హ హ ఈయనగారికి రాజకీయలు, సినిమా రెండు కళ్ళంట, ఆ డవులాగులు విని అబ్బ ఛా అనుకున్యా . అందరు సెప్పి సెప్పి విని విని మాలోటోళ్ళకు సెవులు వాచిపోయినాయి ఇంగా ఈయప్ప వచ్చి ఇప్పుడూ కొత్తగా సెప్తావుంటే డప్పు కొడ్తునట్లు లేదు. ఆ డవులాగులు మంచి పర్సనాలిటీ ( ఉన్నతమైన వ్యక్తిత్వం కల వ్యక్తి ) వుండేటోళ్ళు నోటి వెంట వినడానికి వినసొంపుగా ఉంటాది. బాలయ్య బాబు గారు సెబ్తే ఏమన్నా వుందా చిరాకేసి తుఫుక్కున ఉమ్మేసినా. రాజకీయాలకు నీవు పనికొస్తావా ? అవునులే రాజకీయాలలో కూడ నీలాంటేళ్ళె వుండారు వారికి తోడుగా తమరు వెల్దామని ఆశనా ఇప్పటికే జనాలు విసిగి విసిగి పోయినారు వాళ్ళకు తిక్కరేగి నీలాగే మెంటల్ ఎక్కిందనుకో తరిమి తరిమి కొడ్తారు, అయినా నీవు రాజకీయాలకు పనికొస్తావా ఏంది!

      మీ బావ చంద్రబాబునాయుడుతో పోల్చుకుంటే మీ తెలివేంది, నీ ఙ్ఞానమేంది, పరణితి ఏంది, ఏవన్న విషయాల మీద పూర్తి కమాండ్ వుందా?  పోనీ ప్రజలు పడే కష్టాల మీద అవగాహన వుందా? ఊరికే ఆడ కూర్చొని నాయకులు అవుదామనే, మీ నాయన సంపాదించి పెట్టిన సొమ్ముతో రోజూ తాగి తిని తొంగోడం తప్ప ఏమి సేచ్చానావు? జనాల మద్యన తిరుగుతా ఉండావా? వాళ్ళ కష్టాలు, కన్నీళ్ళు, బాదలకు కారణాలు ఏందో వెతికినావా? పోనీ కనీసం అవెందుకు వాళ్ళకున్నాయో విషయాలమీదన్న నీకు అవగాహన వుందా? మీ బావ  సంద్రబాబుని అందరూ తిడ్తారు గాని, ఆయప్ప ఇషయంలో ఒక గొప్పసంగతి వుందయ్యా విశ్వనీయతలో వై.ఎస్.ఆర్‌తో పోలిస్తే కాస్త తగ్గొచ్చేమోగాని పబ్లిక్ అడ్మినిస్టేషన్‌లో వై.ఎస్.ఆర్ కంటే గొప్పోడు సెంద్రబాబే. ఆ విషయంలో సెంద్రబాబును ఒప్పుకోవాల్సిందే, ఎంత కష్టపన్న్యాడు ఆ స్థాయికి రావడానికి!! ఇప్పటికి రాష్ట్రానికి ఎవ్రూ విదేశీ రాయబారులు, ప్రెసిడేంటులూ, ప్రధానులొచ్చినా సెంద్రబాబుని కలిపోతనారు, ఆయప్ప కష్టపడి అంత స్థాయికి సేరుకుంటే ఇప్పుడేమో సినిమా కలరింగుతో అదంత నీ వశం సేసుకుందామనా నీ తిప్పలు, అసలు నీకు మాట్లాడడానికి సేత కాదు ఏమ్ మాట్లాడ్తానావో ఎవ్రూకీ అర్థం కాదు జనాల్లో తిరగలేవు రోంత కూడ నీకు ఓపిక లేదు మొన్నెప్పుడో కాళహస్తి పర్యటనలో ఎవ్రో మంచి స్థాయి వున్న నాయకుడి  ’చెంప ’చెళ్ళుమనిపించినావు. మనిసన్నాక రొవ్వంతన్న ఓపిక సహనం వుండాలబ్బా. అక్కడ సూడు అవినీతి సామ్రాట్టు కొడుకు జగనన్న ఓదార్పు యాత్రలలో రోజూ కొన్ని వేలమందిని, లక్షల మందికి ఓపిగ్గా షేక్‌హ్యాండ్‌లు ఇచ్చా వుండాడో. మొఖంలో రొవ్వంత కూడ కూడ విసుగు కోపం ఉండదూ ఒకటే సానుబూతి ఎక్స్‌ప్రెషనూ, అట్లా వుండాల మనిషంటే నీలాగ ఉంటే ఇంగ అయితాదా పని సెప్పు. నీలాంటోళ్ళు ముఖ్యమంత్రి అవుతే ఇంగ ఏమన్న వుందా రోజూ ఎంతమంది చెంపలు ఎర్రగ అయితాయో. పోనీ నీవేమన్న పుడింగివా ? సిరంజీవి కంటే నీకేమన్న ప్రజాభిమానం వుందా?

   తెలుగు సినీరంగంలో మకుటంలేని మహరాజు నెంబర్ వన్ యాక్టరూ, ప్రజాబిమానంలో తిరుగులేని హీరో సిరంజీవి. అట్టాంటి ఆయప్పే నాయకత్వ లోపంతో అన్ని మూసుకొని పోయి పోయి కాంగ్రెస్సు పార్టీలో సేరినాడు. ఆయప్పతో పోల్చుకుంటే నీవు యాడ సెప్పు, నీకేమన్న నాయకత్వ లక్షణలుండాయా ? మీ నాయన కథ వేరు. మీ నాయన గొప్ప నటుడు, తిరుగులేని ప్రజాబిమానం వున్న మనిషి, నాయకుడు నటనలో పోల్చుకోకుండ వుత్త ప్రజాబిమానంతో పోల్చుకుంటే మీ నాయనంత ప్రజాబిమానం వున్న మనిషి సిరంజీవి. మరెందుకు మీ నాయన రికార్డ్ స్థాయిలో గెలిచి ముఖ్యమంత్రి అయితే అంతె ప్రజాబిమానం వున్న సిరంజీవి గెలవలేక ఓడిపోయి టెంటు ఎత్తేసి మరో పార్టీలో సేరినాడు ?? తేడా ఏందో తెలుసా  మీ నాయన తెలుగు ప్రజల గుండె లోతుల్లో దూరి ముద్ర వేసుకున్యాడు. సిరంజీవికి కూడ అంతే స్థాయిలో అభిమానం వున్నా అది గుండె లోతుల్లోకి వెళ్ళేంత అబిమానం గూడు కట్టుకోలేదు. ఆ అబిమానం వెర్రికేకలు, ఉన్మాద స్థాయిలోనే ఆగిపోయింది అది తేడా అంతే కాదు నాయకత్వ లక్షణాలు లేకపోవడం. స్వయం నిర్ణయాలు తీసుకునేంత గట్టితనం లేకపోవడం. మరి నీ స్థాయి ఏందో సూసుకో. అసలు మాట్లాడేదే సేత కాదు. ఏమన్న అంటే ఎగిచ్చి ఎగిచ్చి కాల్తో తంతావు లేదా చెంపలు పగలగొడ్తావూ ఇట్టాంటోళ్ళకు అధికారమా ? ఇప్పటికే రాష్ట్రం పూర్తిగా బ్రష్టు పట్టింది ఇంగ నీలాంటోళ్ళకు అధికారం ఇచ్చే అంతే.

    ఇంగ మీ అన్న హరికృష్ణ సంగతి సూద్దాం. ఏమి పీకాడనీ పార్టి పగ్గాలు తనకు తన కొడుక్కి ఇవ్వాలని బో పట్టు పడ్తనాడు ? 1999లో గుడివాడలో పోటి సేసి డిపాజిట్ కూడ రానంతగా ఓడిపోయినాడు. అట్లాంటి ఆయప్పకు పార్టి పగ్గాలు కావాలా ? ఏం యన్.టి.ఆర్ కడుపున పుడ్తే మాత్రం అదే క్వాలిఫికేషనా ? మనిషిలో నాయకత్వ లక్షనాలు అవసరం లేదా ? అవి వొద్దా ? ప్రజల పట్ల రొవ్వంత కూడ సానుబూతి, అబిమానం సూపినాడా  ఎప్పుడన్నా ? జనాల మద్యన తిరిగినాడా ? ఎప్పుడూ సూసినా పీకలదాక తాగడం పందిలా తినడం తొంగోవడమేగా ఆయప్ప సేసేది అట్లాంటోడికి రాజకీయాలు అవసరమా ? ఊరికనే ఇంట్లో కూర్చోని తాగి తందనాలాడి వస్తే నాయకులయితారా ? బాద్యత లేద సమాజం మీద ? సంఘం పట్ల శ్రద్ద అక్కర్లేదా ? అయేమి సేయకుండానే జూ!! యన్.టి.ఆర్ ఇమేజ్‌ని అడ్డం పెట్టుకొని నడిమంత్రం సిరిలాగా అధికారం సెలాయిద్దామనా ? ఈ బుడ్డోడు ఒకడు బుద్దిగా సినిమాలు సేసుకోకుండా తోక ఊపుకుంటూ వాళ్ళ నాన్న ఏమి సెబ్తే అది ఇంటూ రావడమేనా !  తలకాయి ఉపయోగించేది ల్యా, ల్యాకపోతే కేరీర్ నాశనం అయితాది.  ఇంగ వంశం  వంశం వంశం అని ఒకటే మొత్తుకుంటునారు ఏంది మీ వంశం ? పెపంచంలో ఇంగ ఎవ్రుకీ వంశం లేదా ? ఓ అంటు తెగ డబ్బా కొడ్తాండారు ! సెప్పి సీపి మీకు చిరాకేయిలా ? ఇక్కడ మేము సచ్చనాం ఇనలేక మీ వంశం సోది ఆపేయండ్రా సామీ. యన్టీవోడు ఎప్పుడు వంశం వంశం అని సెప్పుకోలా మీరు సెప్పి సెప్పి వంశం పేరే నాశనం జేస్చనారు.

   యన్.టి.ఆర్ ప్రఖ్యాతిగాంచిన మనిషి, గొప్ప నటుడు. ఆయనకు ఈ దుస్థితి ఏందో   " పులి కడుపున పంది పిల్లలు పుట్టినాయి " తలచుకుంటే బాదలేచ్చాది.

   బాలయ్య బాబుగారు ముందు సినిమాలలో బాగా రాణించండి , అది సేతకాకపోతే మీ నాయన సంపాదించి ఇచ్చిన సొమ్ముతో బలాదూర్ తిర్రుగుతూ బతకండి అంతే కాని. రాజకీయాలు, అధికారం అంటూ ప్రజలను చంపకండి. ముందు సినిమా రంగంలో వారసులందర్నీ తరిమి తరిమి కొట్టాలి. అప్పుడు గాని సినిమా రంగం బాగుపడదు.

22 comments:

  1. గోవిందయ్య గారూ... కొంచేం ఘాటుగా చెప్పారు గానీ నిజాలే చెప్పారు.;)
    షూటీంగ్ లలో బాలయ్యబాబు అలా బిహేవ్ చేస్తారా? నిజమే? నాకయితే నమ్మబుద్ధి కావటం లేదు.

    ReplyDelete
  2. @రాజ్ కుమార్
    బాలయ్యబాబుగారు షూటింగులలో ఇంగా సానా ఘోరంగా బిహేవ్ సేస్తాడంట సానా వుంది, అంతా సెబ్తే బాగుండదనీ నేనే కట్ చేసినా, కామెంట్‌నందుకు థ్యాంక్స్

    ReplyDelete
  3. సూపర్ అబ్బీ. బలే బాగా రాశావబ్బీ.

    ReplyDelete
  4. బా.బా.11 June 2011 at 17:12

    అసలు మిమ్మలందరిని బెల్లంకొండను కాల్చినట్టు కాల్చిపారెయ్యాలి. నాకు అల్రేడి హాస్పిటల్ లొ మెంటల్ కేస్ అని సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి కోర్టు కేసులు ఉండవు.

    - B

    ReplyDelete
  5. very balanced. reflects a candid opinion without any psycho-fancy towards anybody.

    ReplyDelete
  6. చాలా బాగా చెప్పారు మేష్టారు

    ReplyDelete
  7. meeru nijamgaa former aa jammalamadugu ninchi? I doubt

    ReplyDelete
  8. @krishna
    @బా.బా
    @satya
    @Anonymous
    @Edge
    @Anonymous

    కామెంటినందుకు థ్యాంక్స్

    లాస్ట్ Anonymous కి
    డిగ్రీ డిస్కంటిన్యూ సేసి కాంట్రాక్టర్ దగ్గర లెక్క పద్దులు రాస్తూ ఖాలీ టైమ్‌లో ఫార్మర్ పని సేసుకుంటాను అన్నా ఎనీ డౌట్స్ :)

    ReplyDelete
  9. గుంపులో గోవిందయ్యగారు! మీ స్లాంగ్ బాగుంది... బాలయ్యబాబును తిట్టడంలో మీ ఇంట్రస్ట్ ఏమిటో- అన్ ఇంట్రస్ట్ ఏమిటో తెలియదుగానీ.. మీరు బాలయ్యను తూర్పారా పట్టేస్తున్నారు. విషయానికి వస్తే చాలా మంది సో కాల్డ్ గ్రేట్ యాక్టర్స్ కంటే.. బాలయ్య నిజంగా లోపలున్నదే బయటకు మాట్లాడే గుణమున్న వాడు. ఆయనతో వేగటం ఇబ్బందిగానే వుంటుందేమో తెలియదు కానీ, చాలా చాలా మంచి వాడు. పండిత పుత్ర- పరమశుంఠ అన్న మాటను తిరగరాసిన వాడు.. అంత పెద్ద హీరోకి కొడుకుగా పుట్టి ఇంత కాలం తాను కూడా హీరోగా మనగలుగుతున్నాడంటే సో గ్రేట్ అని చెప్పవచ్చు. చాలా చాలా మంది హీరోల పిల్లలు ఇలా చేస్తుండవచ్చు కానీ ఎన్టీఆర్ కొడుకుగా పుట్టి ఇలా రాణించడం చాలా కష్టం. ఇంత స్టార్ డమ్ అతనికి వూరకే రాలేదు. మెంటల్ గా ఫిజికల్ గా ఎంతో కష్టపడితే కానీ ఈ స్థాయికి రాలేదు. అది పనిగా స్టాండ్ తీసుకుని పనిమాలా తిట్టుకుంటూ కూర్చోవడం బాగోదేమో గమనించండి. అలాగని తిట్టవద్దని చెప్పడం లేదు. కానీ, అలాగని ఇలా ఫలానా వాళ్లనే తిడుతూ మిగిలిన వారిని భుజాన వేసుకురావడం అంత బాగుండదు. ఇదంతా ఎందుకంటే ఇలా బాగా రాయగల వారు ఫలానా వారి వైపే ఉన్నట్టు కనిపించడం ఫలానా వారిని దెప్పుతూ రావడం అంత మంచిది కాదు. కనుక, గ్రహించగలరు.

    ReplyDelete
  10. @తెలుగుశాల గారు నా స్లాంగ్ నచ్చినందుకు థ్యాంక్స్.ఇంగ బాలయ్యబాబుని నేనేమి తిట్టలేదబ్బ కడుపు మండి రాసాను అంతే. ఏ సోకాల్డ్ యాక్టర్స్ కంటే గుణంలో గొప్పోడబ్బా? లోపలున్నదే బయటకు మాట్లాడ్తే గొప్పడయతాడా ఏంది? మనిషి గుణం చూడాల కదబ్బా ఇంగా నేను సెప్పింది సానా తక్కువ నా కండ్లార చూసింది సానా వుంది నా ఫ్రెండ్ ఒకడు సినిమా ఇండస్ట్రీ పని జేస్చాడులే వాడి వెనక తిరిగినప్పుడూ సూసినా బాలయ్య సిత్రాలు సుల్తాన్ సినిమాప్పుడు అనుకుంటా షూటింగ్‌లో షాట్ అయినాక వస్చాంటే ఎదురుగా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఎదురు పోతాండి బాలయ్యను సూసి పక్కకు తప్పుకొని దూరంగా పోయినా కూడ ఇడిసిపెట్టకుండా వెంటపడి ఎగిచ్చి ఎగిచ్చి కాల్తో తన్నాడు అది ఏ ఆయువు పాట్నో తగిల్తే పాపం అసిస్టెంట్ డైరెక్టర్ బతుకెమయితాది సెప్పు? నాకయితే రక్తం సల సల కాగింది అది సూసి అంతె బయటకు అనేసినా అసిస్టెంట్ ప్లఏస్‌లో నేనుండుంటేనా తిరిగి ఎగిచ్చి ఎగిచ్చి తన్నేవాడిని అన్నా.బాలయ్య హీరో అయితే మాత్రం అలా కొడ్తాడా? కడుపు ఏం తింటనాడు? అన్నం తింటనాడా గడ్డి తింటనాడా? సాటి మనిషిని మనిషిలా సూడపోతే ఎంత పెద్ద హీరో అయితే మాత్రం ఏం లాభం? ఆయప్ప ఒక్కడే కష్టపడట్ల్యా అందరు హీరోలూ కష్టపడ్తనారు. ఏంది పండితపుత్ర పరమశుంఠని తిరగరాసినాడా యాడ? మచ్చుక్కి ఓ నాలుగు సినిమాలు సెప్పు ఆణిముత్యాలాంటివి! ఇంతకాలం మనుగల్గుతున్నాడా ! మీరు బయటలోకంలో తిరుగుతున్నారో లేదో సామి. తెలుగు సినిమాలోకంలో ఒక హీరో సినిమాలు సూడకుండా బ్యాన్ చేసిన లక్షలాది ప్రెక్షకులు మన రాష్ట్రంలోనే ఉండారప్ప ఇట్లాంటి గతి ఏ హీరోకి వుండదేమో?
    నేనేమి అదే పనిగా తిట్టడం లేదప్పా ఉన్న సంగతే సెప్పినా మీరే ఊర్కనే ఉలిక్కపడ్తనారు. ఒకర్ని భుజాన వేస్కొని రాసేంత ఓపిక నాకు లేదయ్య.ఇదే నా మొదటి ఆర్టికల్ ఇంకా మునుముందు సూచ్చారులేండి నా తడాక. మంచిది కాదు అని నాకు సెబుతున్నారు అది సూచనా లేక హెచ్చరికా? సూచన అయితే మీరు సెప్పింది వింటాము అంతవరకె ఏమి రాయలో అదే రాస్తాను. హెచ్చరిక అయితె దానికి వేరె ఉంటాది.

    ReplyDelete
  11. All of sudden blogs are buzzing with hatred against Kamma people. Who is behind this?

    Indians are idiots, who fight among themselves on caste basis, so Sonia can rule over them. Shame on you.

    ReplyDelete
  12. సోనియా పేరుతో హిందువులను మళ్ళి ఏకం చేద్దురుగాని, కొంచెం మీరు ఇప్పటినుంచి జాలిం లోషన్ పూసుకొంటే ( విమర్శలను స్వికరించి ఆత్మ విమర్శ చేసుకోవటం మొదలు పెడితే) కనీసం కొన్ని సంవత్సరాల కైనా కులగజ్జి తగ్గుతుందని ఒక ఆశ. మీ కులగజ్జి అన్ని కులాలను స్పర్సించింది/ అంట్టుకొనింది. మిగతా అభివృద్ది చెందుతున్న వర్గాల వారు ఇదేదో గొప్ప ఆదర్శం లాగా భావించి, దానిని అనుసరిస్తూ అయినదానికి కానిదానికి గోక్కోవటం తెలుగు నాట ప్రమాదకర స్థాయి కి వెళ్ళింది. సిగ్గు ఎగ్గు లేకుండా స్కుల్స్ స్థాయిలో నుంచి ఈ కులగజ్జిని ప్రోత్సహిస్తుంటే,దానిని వ్యవస్థీ కృతం చేస్తుంటే, దాని గురించి వనజా వనమాలి గారు తప్పించి ఆ వర్గానికి చెందిన ఏ ఒక్క ఒక్క ప్రముఖ బ్లాగరు దానిని ఖండించరే. కనీసం ఇప్పటి వరకు ప్రస్థావించను కూడా లేదు. దొంగకు తేలు కుట్టినట్లు గమ్ముగా ఎమీ ఎరగనట్లు, అదేదొ సహజ ప్రక్రియ అయినట్లు ఉన్నారు.
    ------------------------------------------------
    నీ అనుమానపు ఆలోచనలు ఆపు,దీనివేనకాల ఎవరు లేరు గాని. చిన్న విమర్శ వస్తే తట్టుకోలేక అల్లాడుతున్నారు. ఇక్కడ బ్లాగుల్లో రాసుకొనే వారు దాదాపు మధ్యతరగతి వారు నీ మాట వింట్టుంటే కాంగి వాళ్ళు రాందేవ్ రాజ్యం పడ కొట్టటానికి కుట్ర పన్నాడు అన్నట్లుంది. మీకు ఎదుటివారిని ఎగతాళి చేయటం, వారిని నమ్మక పోవటం, ఇటువంటి అనుమానాలు కలిగి ఉండటం, మీవాళ్ళలో మీరే కలసి మెలసి ముఠాలు కట్టి డబ్బులు సంపాదించటం, ఎక్కువైన తరువాత వెన్ను పోట్లు పొడుచుకోవటం, వాటి మీద పుస్తకాలు రాసుకోవటం ఇవ్వని మీ అలవాట్లు. ఎదుటి వారి దగ్గర ఐకమత్యంగా కనిపించి వారిని కులం పేరుతో విసిగించి పీక్క తినటం, మీలో మీరు కొట్టుకుంటూ వెన్ను పోట్లు పోడుచుకోవటం. మీకు అంత కమ్యునిటి ఫిలింగ్ విండి ఉంటే గొదావరి, కృష్ణా జిల్లాలలో కాంగి ఎందుకు గెలుస్తుంది? మీరు పైకి చెప్పేది ఒకటి లోన ఒకటి. జీవితం లో అనుక్షణం ఇంత నటించే వర్గం తెలుగు నాట ఎదీ లేదు. కాని ఈ కులగజ్జి తో అమాయక ఆంధ్రా ప్రజలను పీక్కతినటానికి, అందరి మనసులను చేడగొట్టటానికి తప్ప ఎమీ ఉపయోగం లేకపోయినా దానిని నెత్త్తిన పెట్టుకొని ముందుకు తీసుకేళుతున్నారు. బ్లాగుల్లో కాంగి ప్రభుత్వానికి మటుకు అవినితి మీద సలహాలు ఇచ్చిందే ఇచ్చి తామేదో మంచి వారమని తెగ ఫీలౌతూంటారు.
    ----------------------------------------------
    సూటిగా ఒక ప్రశ్న మీరు మీ కులగజ్జిని గుర్తించారా? గుర్తిస్తే మీలో ఒక్క మేధావన్నా దానిని ఖండిస్తూ పుస్తకం రాశారా? రాస్తే వివరాలు చెప్పేది. కనీసం వనజా వనమాలి గారన్నా బ్లాఉలో ఒకటపా రాసింది. మీగతా ఎంతో మంది ప్రముఖరచయితలు ఎమీ రాశారు?

    Jayaho

    ReplyDelete
  13. జయహో గారు మీకు కుదోస్!

    బ్రాహ్మల్ని, రెడ్లని హీనంగా తిడుతూ చేసుకుంటున్న కులగజ్జి కుత్సుకత.

    కులగజ్జిగాళ్ళ హీనబతుకులు బయటపెట్టే పిక్స్ ఇప్పుడు క్లియర్ కట్ టెక్స్ట్ తో.

    http://2.bp.blogspot.com/-vQ9Qw5nYiXg/Tfu1dWdRZ8I/AAAAAAAAABY/3DxuNDz0OdA/s1600/Snap4.jpg
    http://1.bp.blogspot.com/-E5zS5aLhrV0/Tfu3BO3NaqI/AAAAAAAAABg/CszQPIF9fwo/s1600/Snap3.jpg
    http://4.bp.blogspot.com/-_vyQy17qXLs/Tfu16E21-PI/AAAAAAAAABc/q3w08bvmK70/s1600/Snap5.jpg

    చర్చ ఇక్కడ http://againstcastemania.blogspot.com/2011/06/blog-post.html

    ReplyDelete
  14. అనానిమసబ్బీలు
    మీకందర్కీ ఒక ఇన్నపం మీ మీ కులగజ్జీలు విద్వేషాలు బాతులు అన్ని తీసుకపోయి మీ బ్లాగ్‌ల్లో రాసుకోండి, అంతే గాని నా బ్లాగ్‌లో మీ ఇకారలన్నీ పెట్టగాకండి. మీకులాగ నాకు కులమతప్రాంతీయ గజ్జి లేదబ్బా నేను మనుషుల గురించె రాస్చనా అంతే. నాకు మీ కులాలతో ప్రాంతాలతో ఏమి సంబందం లేదు ఇంగ అట్లాంటీ కూతలు ఈడ రాస్చే నాకు బూతులు వస్చాయి.

    ReplyDelete
  15. On MS Reddy

    http://jaijainayaka.blogspot.com/2011/06/blog-post_2718.html?showComment=1308461084157#c2286685254093648291

    ReplyDelete
  16. chudandi. balakrishna ke kaadu, chiranjeevi ki kuda asalu Cm padavi hakku ledu. siggu lekunda ee chetta vedavalu dabbulu dochukovadaniki rajakeeyalu loki veltunaru. Sr. NTR unnappudu evadu kulam lekunda herolanu adaranchevaru. chiranjeevi vachaka kulagajji perigindi. kapulu kulam meeda prematho chiru nu pogudutu bala krishna ni baaga vetakaram chese vaaru. prajalu alavaatu padipoyaru. vaari kula gajji mattulo padi nijam marchi poyaru. Bala Krishna kuda manchi natude. asalu cheppalante chiranjeevi kante manchi natudu. Kula janaba takkuva undadam vala venaka padipoyadu. Idi pachi nijam. chetanayite inkodariki teliya cheyadandi. endukante nenu mee blog ki malli raakapovachchu. Ide pachchi nijam. pakshapatam chupakandi.. mee

    ReplyDelete
  17. ramana or gumpulo govindayya, nijam telekunda pachchi nijalu anni rastunav. nuvvu blog musey. endukante rajakeeyalaku evadu paniki raadu. jagan panikoste balakrishna inka better. tandri peru cheppuku batukutunadu, tandri peru cheppuku batukutunadu,tandri peru cheppuku batukutunadu, ani arichi gee pettukokunda.. Tandri vadilina badyatalanu kasta mostunadu ani cheppuko. arey meeku siggu leda?
    Ramcharan cheste tandri peru nu nilabedutunadu antaru. Ade pani Jr. NTR cheste tata peru cheppukoni batukutunadu antaru. thu, meedi kulagajji kaadu. burragajji. cheppu maatalu vini vini cheppudu maatale nijam anukuntunaru. mee laanti vaalu sanka naakipovatam tappa edagaru gaaka edagaru

    ReplyDelete
  18. హరిమోహన్‌దాసబ్బి, ఏంది అట్ల రెచ్చిపోయినావే బాదపడ్నావా ఏంది? నిలాగ నాకు కుల గజ్జి పక్షపాతం లేదబ్బి నాకు ఏది అనిపిచ్చే అది రాస్చా ఈడ నీకెంది బాద? సదివితె సదువు అంతెగాని నా బ్లాగ్ మూస్కోమని సెప్పడానికి నీవు యెవరు సెప్ప నీకేమి అధికారముంది నేను సంపాదించిన లెక్కతో నెట్ పెట్టుకున్యా బ్లాగ్ తెరిచినా నీదేంది రుబాబు ఈడ పోయి మీ ఇంట్లో సూపిచ్చుకో నీ రుబాబు నీకు బాలయ్య ఇస్టమైతే అట్లనే నెత్తిమీద పెట్ట్కోనీ పూజించుకో నీలాగె నేను పూజించాలంటే అయితాదా సెప్పు? ఆయప్ప ఒక యాక్టరూ నీవొక ఫ్యాన్‌వి సరిపోయింది బాగానె ఉండారు తిక్క నాయాల్లు. ఎవడు ఎవ్రు పేరు సెప్పుకుంటే నాకేంది సెప్పు మంచిగ యాక్టింగ్ సేస్చానారా లేదా మనిషి సరిగ్గా ఉండారా లేదా సూస్చాం అంతే. ఊర్కే మా వాంశంగొప్ప మావంశంగొప్ప అంటేనే తిక్కరేగుతాది మాకు ఇంగ ఎవడికీ లేవా ఏంది వంశాలు? అయినా సినిమాలు తీసి పబ్లిక్‌లోకి వచ్చినాక డబ్బులు పెట్టి సినిమాలు సూసేటోళ్ళు ఏమైనా అనేకి హక్కు వుందబ్బా ఆ హక్కుతోనే ఇక్కడ రాసినా. నీవు నా బ్లాగ్‌కి వస్చే ఏంది రాకపోతే ఎంది సెప్పు. నా బ్లాగ్ నా ఇస్టం అంతె

    ReplyDelete
  19. గుంపులో గోవిందయ్యగారు ,
    హా .. హా .. హా .. నవ్వీ నవ్వీ పొట్ట నెప్పెడుతుంది . అదరగొట్టేశారండి బాబు ! చాలా చాలా బాగా రాశారు . అభినందనలు . మీ నుండి మరిన్ని పోస్టులు రావాలనీ , అవి కూడా వెంట వెంటనే రావాలని కోరుకుంటున్నాను .

    ReplyDelete
  20. @ డాట్టర్ గారు థ్యాంక్సండి, మీలాంటి వాళ్ళ ఆశీర్వాదాలుంటే ఇంగా పోస్ట్స్ రాస్చా.

    ReplyDelete