Friday 17 June 2011

రెడ్డితాత ఆత్మకథ ( ఆత్మస్థుతి పరనింద )

      యమ్.ఎస్.రెడ్డి తాత ఆత్మకథ రాసి సినిమావాళ్ళందరికీ ముచ్చెమటలు పోయిచ్చినాడనీ బో సెప్పుకుంటనారు అందరూ. మొత్తానికి రెడ్డితాత వయసుడిగినాక ఆత్మ రాసినాడబ్బా ఇదే కథ వయసులో ఉన్నెప్పుడు రాసింటే బాగుండేదే అప్పుడూ వీపు విమానమోత మోగిండేది తాతకు. ఇసిత్రమెమిటంటే ఆయప్ప మాత్రమే మంచోడు ఆయప్ప సుట్టూ వుండేటోళ్ళు సానా మంది నమ్మకద్రోహులు, మాటతప్పినోళ్ళు, నయవంచకులయినారు, అదెట్లా అయినారో ఎవ్రున్న సెబ్తారా?
     యన్టీయార్ విషయం సూడండి, పౌండ్రక వాసుదేవుడు ఇసయంలో యన్టీయార్ హూ ఈజ్ దట్ ఫెలో ? వీడెప్పుడు మాకు తగల్లేదే ! అడిగినట్లు సెప్పకొచ్చినాడు. యన్టీయార్ ఇసయంలో సాలా మంది సానా సెప్పినారు ఆయప్ప గురించి బయట పెపంచంలో సానా పుకార్లు సికార్లు సేచ్చనాయి నిజంగా అయన్నీ నిజం కాదు అని పాతకాలం యాక్టరూ బాలయ్య, దర్శకుడు హేమాంబధరరావు సానా ఇంటర్‌వ్యూలలో సెప్పగా నేను సదివినా.అయినా నాకు ఇక్కడ ఒక పెశ్న తొలుస్చాంది సినిమా స్టార్టింగ్ ముందరే  హీరోకి కథ అంతా సెప్తారు కదా అట్లా యన్టీయార్‌కి సెప్పినప్పుడు పౌండ్రక వాసుదేవుడి గురించి సెప్పలేదా? సెప్పింటే యన్టీయార్ ఆపాత్రపైనా అప్పుడే అబ్జ‌క్షన్ సెప్పింటాడు కదా?  ఒక సారి కథ ఓకె అయినాక యన్టీయార్ కథలో జోక్యం సేసుకోడని విన్నామే.మల్లా షూటింగ్ మద్యలో హూ ఈజ్ దట్ ఫెలో ఎట్లా అడిగినాడు? అంటే కథ సెప్పినప్పుడు పౌండ్రిక పాత్ర ఇసయం సెప్పకుండ దాపెట్టి వుండిండాల లేదా మీరు సెప్పేది ఉత్తది అయుండాల? అంటే యాడ్నో మిస్టెక్ వుండాదనిపిస్తాంది నీలోనా లేక నీ వయసులోనా? యన్టీయార్‌కి పౌరాణికాల్లో ఏది డౌట్ వచ్చినా ముందుగా కె.వి.రెడ్డిని పింగళిని  ఆయప్పను ఎక్కువ అభిమానించే చక్రపాణిని కల్సి ఆ డౌట్‌ని క్లియర్ సేస్కొని అప్పుడు యాక్ట్ సేచ్చాడట మరేందో ఈ రెడ్డితాత ఇట్లా సెప్తనాడూ ? ఏది నిజం అబ్బా ? మల్లా ఏంది ఈయప్ప దెబ్బకి యన్టీయార్ దిగివొచ్చి యాక్ట్ సేసినాడట ? జోక్ సెప్పినట్టు లేదూ ?
     ఇంగ యన్టీయార్‌తో సినిమా డేట్స్ కోసం పోయి గంటలు గంటలు ఎద్రుసూసినానని సెప్పకొచ్చినాడు, అట్లనే ఈయప్పకోసం  కొన్ని వందల మంది ఎన్ని గంటలు వేయిట్ సేసినారో ఈయప్పకు తెల్సా ? ఒక్కో సమయంలో  సెలబ్రెటీస్‌కి పరిస్థితులు ఎట్లా క్లిష్టంగా వుంటాయో తెల్దా ఈ పెద్దాయనికి? కరవమంటే కప్పకు కోపం ఇడ్సమంటే పాముకు కోపమనీ అట్టా వుంటాది యవ్వారం అట్లనే జూయన్టీయార్‌ కూడ నీకోసం ఏయిట్ సేసి పోయింటాడేమో ? ఎవరికెరుక ? మీ మేనేజర్ సెప్పిన మాటలి ఇని అయే నిజాలు అనుకుంటివా రెడ్డితాత అయే నీ ఆత్మకథలో రాసినావా? సెప్పుడు మాటలు ఇని అయే నిజాలనుకునేంత స్థాయికి దిగజారినావా? సినిమా ఇండస్ట్రీలో ఒకటికి నాలుగుమాటలు సెబ్తారనే ఇసయం తెలీదా నీకు తాత? జరిగేది ఒకటైతే సెప్పేది నాలుగు ఎక్కువే సెబ్తారే మీ ఇండస్ట్రీలో.

    జరిగిన పొరబాటుకు యన్టీయారే మీ ఇంటికి వస్చానని సెప్పినాడు కదా ఇంగేంది ఆడ తప్పు? ఆయప్ప ఎవుడి దగ్గర డబ్బు తీసుకున్యా మల్లా సినిమా రెమ్యూనిరేషన్‌లో పట్టుకోమ్మని నిర్మాతలకు సెబ్తాడంటనే నిజం కాదా ఏంది ? పాత సినిమాల డైరెక్టర్ హేమాంబదరరావు యాడ్నో ఇంట‌ర్‌వ్యూలో సెప్పినాడు అది ఇన్నాలే నేను. ఆయప్ప గురించి అట్లా ఏందంటె అది బయట పుకార్లు సెబ్తారు అదంతా ఉత్తదే అంటారు వాళ్ళు మరేది నిజం అబ్బా ?

    శొభన్‌బాబు ఇషయం ఎంత నిజమో మీకే ఎరుక కాని అట్లాంటిదే ’అంజి ’ సినిమాకు జరిగితే శోభన్‌బాబుకు సేసినట్లు గొడవ సేయలేదే ఎందుకు రెడ్డితాత? అంజి సినిమాకు మీ మనవడు వరసయ్యే వినోద్ రెడ్డి కెమెరామెన్ అంట కదా మొదట్లో, మీ మనవడు కూడ సిరంజీవి సెట్లోకొచ్చే లేచి నమస్కారం పెట్టేవాడు కాదంటనే నిజమేనా ఏంది? సిరంజీవికి కోపమొచ్చి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డికి సెబ్తే వెంటనే మీ మనవడిని పీకేసి ఆయప్పకు చెక్కభజన సేసే మనిషిని కెమరామెన్‌గా పెట్టినారంట కదా? నిజమా కాదా ఏంది సెప్పు? అప్పుడేమో శోభన్‌బాబు మీద పిర్యాదులు సేసినావు మల్లా ఇప్పుడేమి అయ్యింది ? శోభన్‌బాబు సిరంజీవి లాగ నెంబర్ వన్ స్టార్ కాదు అందుకే పెద్ద గొడవ సేసినావు ఈడేమో సిరంజీవుతో గొడవ అంటే అంతే ఇండస్ట్రీలో నిలబడటం కస్టమనా? అదీకాక సిరంజీవితో సినిమా అంటే పెద్ద డబ్బులొచ్చాయి ఆ ’డబ్బు ’ కోసం అన్ని బరించినావు ఇదేంది సెప్పు . ఏమంటారు దీన్ని ద్వందవైకరి కదా రెడ్డి తాత ?

   అయినా ఎప్పుడో పోయినోళ్ళ గురించి సెప్పి ఎమి లాభం నీకు ? వాళ్ళు గురించి సెప్పినా నిన్ను ఏమి సేయలేరు ఇంగా కాంట్రావర్సీ అవుతాది బుక్స్ బాగా సేల్ అవుతాయి అట్లనే వాళ్ళ పైన ఉన్న కోపం ఇట్లా ఆత్మకథ రాసి కుతి తీర్చుకున్యావ్ లా ?? ఇంగ రాజశేఖర్ మీంద ఏమి రాసినా ఆయప్ప నిన్ను ఏమి పీకలేడని నీకు తెల్సు అల్లుబావ గూండాల సేత దాడి సేసినా ఏమి సేయనోడు నిన్నేమి సేస్చారని ధైర్యం కదా ?

   మనసులంటే నీకు ఎంత సిన్న సూపో సూసినావా రెడ్డితాత. అవకాశాల కోసం తిరుగుతున్న మనుసులు నీ దుష్టిలో అనామకులా ? వాళ్ళు క్రియేటర్స్ అనడానికి నీకు మనసొప్పలేదే ఆడికేదో నీవు ధర్మ పెబువు అయినట్లు అవకాశాలిచ్చనావా ఈ పెపంచంలో ఒకరికొకరు అవసరమబ్బా కాదా ? ఆయప్పకు సినిమా తీసే నిర్మాత కావాలి నీకు మాంచి క్రియేటర్ కావాలి మీయి అవసరాలు ఇందులో నీవేదో త్యాగం సేసినట్లు సెబ్తనావే?

     నీ మనసుని గాయపరిచినా మీ కొడుకులో ప్రవహించేది నీ రక్తమే అనుకొని సరిపెట్టుకొన్నావే ఏం ఎందుకు నీ కొడుకనా ? స్వార్థం కదూ ! అదే బయటోళ్ళు సెస్తే బాదపడ్తనావ్ ఏంది తాత ఇది. నాకు తెలీక ఒకటి అడుగుతా ఆత్మ కథ రాస్చే అది సదివినోళ్ళకు ఇన్‌స్పేయర్‌గా వుండాలి ఎదిగినమనసులు ఓడిపోయిన అనుభవాలని సూసి ఇశ్లేషణ సేసుకోవాలి మరేంది నీ ఆత్మ కథలో ఆత్మ స్తుతి పరనింద తప్ప ఏమి లేదు. ఆ ఇషయాలన్నీ ఎక్కడైనా జరిగేటేవే. అయి సెప్పుకొని నీ మీద జాలి తెప్పించుకుందామనా ఈ ఆత్మకథ రాసుకొంది? రేపు నీలాంటి వయసు పెరిగిన సెలబ్రెటినే నీలాగ ఆత్మ కథ రాస్చాడు ఎవరో ఎందుకు సిరంజీవి రాసినా ఆయప్పకు కూడ పేరు రాకముందు ఎంత మంది నిర్మాతలు ఇస్చామని సెప్పి ఇయ్యకుండా రెమ్యూనిరేషన్ ఎగ్గొట్టిన నిర్మాతలు పేర్లు సెబ్తాడో ? ఏ ఏ నిర్మాత అవకాశలిస్చానని ఎట్లా తిప్పించుకున్యారో సంగతులన్నీరాస్చే? నీమీద కూడ సెప్పొచ్చు. సిరంజీవి కాకపోయినా ఇంగో యాక్టరో, టెక్నీషనో ఆత్మకథలో నీగురించి కూడ రాస్చే అయన్ని నిజాలే అని ఒప్పుకుంటావా ఏంది? అట్లా అందరూ ఆత్మకథలు రాసి ఒకరినొకరు యేలెత్తి సూపిస్చే. తెల్దా మాకు మీరందరూ దొందూ దొందేననీ? అందరూ దొంగలేననీ అర్థమయితాది. ఎవర్కీ వాళ్ళు ఆత్మకథల్లో వాళ్ళను మాత్రం మంచి సెప్పుకొని మిగతా అందరూ నన్ను వంచించినారని రాస్చే ఎట్లా ఉంటాది  సెప్పు రెడ్డితాత ?

   నేను నీ బుక్ సదవలేదు గాని నీ గురించి కూడ ఒక పుకార్ ఉందే నీ కింద పనిసేసినోళ్ళకి సరిగ్గా డబ్బులియ్యవనీ పిసినారివనీ పతీది సూస్కొని సూస్కొని బ్యారమాడి సతాయిచ్చి ఇచ్చావంటనే మరి నీ గురించి ఇట్టాంటి ఇషయాలు నీలాగే మరో సెలబ్రెటీ పెద్దాయన రాస్చే తెలుస్చాదిలే మాకు. అవునూ ఇట్లా సినిమాలో పేరు తెచ్చుకొన్న వాళ్ళు మాత్రమే సేసినారా లేక మామూలు మనుషులు కూడ సేసినారా? సేసుంటే వాళ్ళ గురించి రాసినారా ? రాయరేమో ఎందుకంటే వాళ్ళు సినిమా వాళ్ళలాగ పేరు పెఖ్యాతులు ఏమి వుండవు రాసినా పెద్ద మైలేజి రాదు. ఈ ఆత్మకథ దెబ్బతో కుల సామాజిక వర్గాలకు మంచి టైం పాస్ అయితాదిలే. ఒకరికొకరు సరిపోనోళ్ళకు మంచి విందు. సంకలు బాగా ఎగిరేచ్చారు. కసిగా ఎంజాయి సేస్చా వుంటారు
   అవునూ ఒక ఇసయం మర్చినా అదేనబ్బా వై.యస్ అధికారంలో ఉన్నెప్పుడు బాగానే కాంట్రాక్టులు పట్టినారు కదా! దానికి ఉడతాభక్తిగా పార్టి ఫండు బాగానే ముట్టసెప్పలేదా ఏంది?
     టి.విలోనూ న్యూస్ పేపర్లో బ్లాగ్‌లో సదివిన దాన్ని బట్టి సూచ్చే నీ ఇషయంలో మీకెవ్వరూ సాయం సేయిలా కనీసం ఒకరన్న మీకు హెల్ప్ సేయలేదు ఎందుకంటావు తాత ? ఎక్కడో ఒక సూక్తి సదివినా ఇప్పుడూ నీ కథ ఇన్యాక గుర్తుకొచ్చాంది  " మన చుట్టు వున్న ప్రపంచంలో మనల్ని ఎవురూ పేమించకపోతే...   అది నిజంగా మన తప్పే " ఆ సూక్తి మీకు బాగా సరిపోతాది తాత. ఒకరో ఇద్దరో సాయం సేయలేదంటే ఏమోలే వాళ్ళు దొంగనాయాలు నీవంటే సరిపోదు నయవంచకులే అనుకోవచ్చు. ఎవ్రు మీకు సాయం సేయలేదంటే తప్పు యాడుందో మీరు సూసుకోవాల. మనదగ్గరే ఏదన్న రాంగ్ వుందా అని సూసుకోవాల రెడ్డితాత.

   సివరిగా మనలో మన మాట అందరి ఇషయాలు రాసినావు గాని ఒకర్ని మర్సిపోయినావు కావాలనీ మర్సిపోయినట్లు యాక్టింగా ? బాలయ్యబాబుతో గూడ సిన్మాలు తీసినారు కదా రెడ్డితాత ? ఆయప్ప గురించి ఏమి రాయలేదే ఎందుకు ? రాస్చే ఏదన్న తేడా వస్చాదనా ? తేడా వస్చే ఆయప్ప అందరిలాగ గమ్మున వుండడు ల్యా ? తుపాకి తీస్కొని కాల్చిపారెచ్చాడని భయపడ్నావుల్యా ? నాకు తెల్సులే రెడ్డి తాత.

13 comments:

  1. మల్లెమాలగారి ఆత్మకథమీద ఇదే బెస్ట్ సమీక్షేమో. అవును...ఈయన, వీళ్ళబ్బాయి టెక్నీషియన్లకు డబ్బులు ఇచ్చే పద్ధతి మీద విమర్శలు నేనూ విన్నాను. అసలు ఈయన కెరీర్ లో సినిమాలు వరసగా తీయడమేగానీ, ఒక్క హిట్ కూడా లేదు(రామబాణం, ఏకలవ్య మొ..వి). కొడుకు శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఎదిగొచ్చి ఆహుతి సినిమాతో వీళ్ళ దశను తిప్పాడు. అవునూ, వీళ్ళు బాలయ్యబాబుతో సిన్మా తీసినట్లులేదే.

    ReplyDelete
  2. ఎన్ టీ ఆర్ తో మొదటి అనుభవం లోనే, తన ఆత్మాభిమానం దెబ్బ తిన్నప్పుడే, ఈయనకు సినిమా ఇండస్ట్రీ లో ఆత్మాగౌరవానికి పెద్ద విలువ లేదన్న విషయం అర్ధమైఉండాలి.అంత అభిమానం ఉన్నవాడైతే అప్పుడే ఇండస్ట్రీ నుంచీ బయటకు వచ్చి ఉండాల్సింది. కానీ ఈ రోజుకు కూడా ఈయన ఇండస్ట్రీ లో ఉన్నాడంటే, ఈయనకు స్వాభిమానం కంటే డబ్బే ప్రధానమని అర్ధమౌతుంది.

    ReplyDelete
  3. అబ్బీ,
    ఆయప్ప గురించి మీరే బాగా రాశారు గదా! ఇంతకన్నా ఏముంది ఆయప్ప గురించి రాయటానికి, విశ్వామిత్ర సినేమా సందర్భంలో సహ మరాఠి నటితో అసభ్యంగా ప్రవర్తించినది రాయాలా,వారి తండ్రి ముఖ్యమంత్రి కనుక ఆమే నోరు నొక్కి, మీడీయాని మానేజ్ చేసి తన పరువును కాపాడుకొనేదాని గురించి రాయాలా? ఒకటి మటుకు నిజం ఆయన రాసిన వాటిలో నిజానిజాలు తెలుసుకోవాలంటే భాజా భజంత్రీలకు అలవాటైన సినేమా వారిని అడిగే కన్నా ఆడపులి,పురచ్చి తలైవి జయలలితని అడిగేతే సరి పోతుంది.
    ----------------------
    ఇంతకీ తేజస్విగారు సినేమా రంగానికి సంబందించిన వారా?

    Srinivas

    ReplyDelete
  4. @శ్రీనివాస్ గారు,

    బొత్తిగా ఏ సంబంధమూ లేదండి. కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన ఇండస్ట్రీ వ్యక్తులతో మాట్లాడేటపుడు ఈ మాటలు విన్నాను.

    ReplyDelete
  5. @తేజస్వి
    రెడ్డితాతతో వంశోద్దారకుడు సినిమా సేసినాదు బాలయ్య బాబు

    @బొందలపాటి
    థ్యాంక్స్

    @అనానిమసబ్బి
    ఆకాలంలో నీవు సెప్పినట్టుగా మీడియాలేదబ్బీ అప్పుడంతా పేపరే ఆ న్యూస్ గుడకా వచ్చింది ఆంద్రభూమిలో యన్టీయార్ అంటే పడదు కదా తర్వాత రోజే సిరంజీవి నాగార్జున వెంకీ అందరు ఆ వార్తను ఖండించినారుబాలయ్య అట్టాంటోడు కాదని అయినా ఈ ఇసయం నీవు నేను సెబ్తే గాదు మైలేజి వస్చేది మన రెడ్డితాత ఆత్మకథలొ రాస్చే అప్పుడూ మజాగా వుంటాది

    ReplyDelete
  6. "ఏనాడో చనిపోయి తమ వంతు సంజాయిషీ
    ఇచ్చుకోవడానికి తిరిగిరాలేని శాశ్వత మౌన దివంగతుల మూర్తిమత్త్వం మీద
    నిర్దాక్షిణ్యంగా పేడ పూస్తూంటే విషాదంగా అనిపిస్తోంది".

    It looks like MS Reddy is a coward. Dead people can not counter his allegations. Those people may have a different version of all these events.

    Shame on MS Reddy to spoil the reputation of dead people.

    ReplyDelete
  7. 'స్వార్థం' కోసం కాకపోతే ఎంటీఆర్ దేశసేవకోసం నటించాడా? ప్రతిపనికిమాలిన యెదవ బిజినెస్కీ 'ఆత్మాభిమానం, కళ, సంస్కృతి, దేశం' అనే పెద్ద పెద్ద పదాలు వాడకండ్రా బాబూ, మీ బాంచన్ కాల్మొక్త.

    ReplyDelete
  8. @అనానిమసబ్బీ
    దేశంసేవకోసమని యన్టీయారూ లేదా నేను ఎక్కడన్నా సెప్పినామా ఏంది? అన్నా బాంచన్ నాకాల్మొక్కెద్దే పోయి మీ దొర కాళ్ళు మొక్కు.

    ReplyDelete
  9. *It looks like MS Reddy is a coward. Dead people can not counter his allegations*.

    రేడ్డిగారు, పిరికివాడు మిగతా వారంతా కొండవీటీ సిం హాలు. రామా రావు గారి గురించి ఆరోజుల్లో మండలాధీశుడు లాంటి ఎన్నో సినేమాలలో ఆయన గురించి చెప్పారు. ఇంకా చెప్పాలి అంటే సినినటుడు రక్త కన్నీరు నాగ భూషణం, నల్లప రెడ్డి శ్రీనివాసుల రెడ్డితో కలసి శినయ్య సేన పేరు తో ఎన్నొ సభ్లు నిర్వహించారు అప్పుడు రెడ్డిగారు చెప్పిన అనుభవాల లాంటివి ఎన్నో ఆయన ఆమీటీంగ్ లో చెప్పారు. బతికి ఉన్నపుడే రామారావు గారు ఎమీ కౌంటర్ ఇవ్వలేదు. ఇప్పుడు ఎదో రేడ్డిగారు చనిపోయిన వారి గురించి నోరు పారేసుకొన్నారు అని అంట్టున్నారు.

    ReplyDelete
  10. కులగజ్జి లీక్స్..కులగజ్జి లీక్స్..కులగజ్జి లీక్స్....

    అదంతా కులగజ్జితో వచ్చిన బలుపు మదం తోలుమందం. తుప్పునేనితో మొదలైన కులగజ్జిని ముండమూరి పెంటీవోడు పెంచిపోషించాడు. ఈ పెంటీవోడికి ఎంత బలుపో, తండ్రిలాంటి

    నిర్మాతలని ఎంత బాధపెట్టేవాడో ఈ లింకులో చూడండి http://www.youtube.com/watch?v=6-F2W-O5LvU. ఇతర కుల నిర్మాతలని

    టూ మచ్గా ఏపుకుతినేవాడు. చివరికి సొంతకూతురి పెళ్లిఖర్చులు కూడా హీనాతిహీనంగా నిర్మాతచేతే పెట్టించిన దరిద్రుడు. వేరేకులంవారివల్ల అహం దెబ్బతిని ద్వేషంతో రాజకీయాలకొచ్చి

    తెలుగువాడి ఆత్మగౌరావాన్ని కాపాడ్డానికి వచ్చానంటూ పచ్చపత్రిక ద్వారా డప్పా కొట్టుకున్న గొప్ప కులపిచ్చోడు. ఇలాంటోడికి భారతరత్నంట..ఛీఛీ..ఆంధ్రకులగజ్జిరత్న ఇవ్వాలని నేను

    డిమాండ్ చేస్తున్నా.

    కులగజ్జి లీక్స్..కులగజ్జి లీక్స్..కులగజ్జి లీక్స్..కులగజ్జి లీక్స్..

    కులగజ్జికి వ్యతిరేకంగా పోరాడండి: http://againstcastemania.blogspot.com/2011/06/blog-post.html

    ఒంటేలు చౌదరి గాడి నిజస్వరూపం ఇక్కడ http://img19.imageshack.us/img19/1378/castemadopt3.jpg జూం

    చేసి చివరి కామెంట్ చూడండి ఒంటేలుగాడి కులగజ్జి ప్లాటినం మెంబర్, చివరకి కుక్కలకి కుడా కులగజ్జి అంటించాడు

    ReplyDelete
  11. చివరి అనానిమసబ్బీ
    ముందు నీ విద్వేషం ఈడెందుకు కక్కుతావు సెప్పు పోయీ మీ బ్లాగుల్లొ కక్కుకోండి ఈడ వద్దు మీలాగ నాకు కులమతప్రాంత ద్వేషాల్ఉ లేవుగాని నా బ్లాగ్‌ని కంప్ సేయకండి.

    ఇక రెడ్డితాత గురించి వచ్చనాయి అసలు బాగొతాలు సూడండ్రి అసలు విషయాలు ఆంధ్రజ్యోతిలో వచ్చినా ఈయప్ప మాటలు ఇనండి.

    మల్లెమాలా.. మీకిది తగునా?
    మీ చరిత్ర గుర్తు చేసుకోండి
    ఎంఎస్ రెడ్డిపై నిర్మాత కాట్రగడ్డ ధ్వజం
    తీవ్రస్థాయిలో ఆరోపణలు

    చెన్నై, జూన్ 18 : 'ఇదీ నా కథ' పేరుతో సీనియర్ నిర్మాత మల్లెమాల సుందరరామిరెడ్డి (ఎంఎస్ రెడ్డి) రాసుకున్న 'ఆత్మకథ'లో దివంగత ఎన్టీ రామారావు, శోభన్‌బాబులపై అసత్య కథనాలు అల్లారంటూ సీనియర్ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శనివారం చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ... ఎంఎస్ రెడ్డి కథలోను, తర్వాత ఆయన మీడియాలోను చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమైనవన్నారు. ఎన్టీఆర్‌తో సినిమాలు తీసి లాభాలు గడించిన ఎంఎస్ రెడ్డి, చివరకు ఎన్టీఆర్ చనిపోయిన ఇన్నేళ్ల తర్వాత అవాకులు చవాకులు పేలడం ఆయన వయసుకు మంచిది కాదన్నారు.

    ఇన్నేళ్ల తర్వాత శోభన్‌బాబు ఫలానా కెమెరామెన్ కావాలన్నారని నిందలువేయడం సరికాదన్నారు. ఆ నటులంతా జీవించి ఉన్నప్పుడే పత్రికాముఖంగా ప్రకటిస్తే ఆయన నిజాయితీని అందరూ గుర్తించేవారన్నారు. తాను నిర్మించిన 'ఆలుమగలు' సినిమాను వైజాగ్‌లో విడుదల చేయడానికి రూ. 4.25 లక్షలకు అంగీకరించిన ఎంఎస్ రెడ్డి, అతి కష్టంపై రూ.2 లక్షలు మాత్రమే ఇచ్చారని, మిగిలిన డబ్బు ఇప్పటికీ ఇవ్వలేదని ఆరోపించారు. 'అందం' సినిమాకు పెట్టుబడి పెట్టిన ఫైనాన్షియర్‌ని కూడా మోసం చేసిన విషయం లోకానికి తెలుసన్నారు. ప్రభుత్వం నుంచి పొందిన స్థలంలో మల్లెమాల శబ్దాలయ రికార్డింగ్ స్డూడియో కట్టారన్నారు.

    అందులో అసలు సినిమా శబ్దాలకంటే రోడ్డుపై వెళ్లే వాహనాల శబ్దాలే ఎక్కువగా రికార్డయ్యేవన్నారు. దీంతో మద్రాసులో రికార్డింగ్ చేయించుకున్న నిర్మాతలకు తన స్టూడియోలో రికార్డింగ్ జరిగినట్టు ఎఫ్‌డీసీ అధ్యక్షుని హోదాలో నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చి ప్రభుత్వ రాయితీలు వచ్చేలా అడ్డదారులు తొక్కారన్నారు. చివరగా 'పెళ్లిపందిరి' అనే చిత్రాన్ని నైజాంలో విడుదల చేస్తానని, ప్రివ్యూ కోసం ఒక బాక్స్ తీసుకుని, నిర్మాతలకు.. పంపిణీదారులకూ తెలియకుండా హైదారబాద్‌లో అక్రమంగా రిలీజ్ చేశారన్నారు.

    ఇది గ్రహించిన చిత్ర నిర్మాతలు హెచ్చరికలు చేయగా ప్రసాద్‌ల్యాబ్‌లో మధ్యవర్తితో కలిసి తన్నులు తప్పించుకున్న ఘనచరిత్ర కలిగిన ఎంఎస్ రెడ్డి దివంగత నటులపై తప్పుడు రాతలు మానుకోవాలని సూచించారు. ఇకనైనా ఎంఎస్ రెడ్డి ఎన్‌టీఆర్-శోభన్ బాబు కుటుంబాలకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన ఆత్మకథ పుస్తకాన్ని ఉపసంహరించుకోవాలని సూచించారు.

    ఇదిగో లింక్:https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/jun/19/main/19main38&more=2011/jun/19/main/main&date=6/19/2011

    ReplyDelete
  12. వీలుంటే 14-10-2012 ఈనాడు ఆదివారం లో శర్మ ( మణిశర్మ తండ్రి ) గురించి వచ్చింది చదవండి .. ఆయన రామారావుతో తన గొడవ గురించి చెప్పారు . రామారావు , తాతయ్య , ఎవరైనా కావచ్చు సినిమా వాళ్ళు మనుషులే మనుషులకు ఉండే లక్షణాలు అన్ని వాళ్ళకు ఉంటాయి .. మంచి చెడు అన్ని ఉంటాయి . మిరే రాశారు ఈ విషయం వయసులో ఉన్నప్పుడు రాస్తే విపు విమానం మోత మోగించే వారు అని. (విపు విమానం మోత అంటే చెయ్యితో కొట్టడం కాదు కడుపు మిద కొడతారు . మని శర్మ తండ్రి చెప్పింది అదే) అది నిజమే అందుకే సినిమా రంగం లో బఠాకలనుకున్నప్పుడు ఎవరు నిజం చెప్పారు . తాత వయసు మీరింది ఇక సినిమా రంగం తో ఆయనకు పని లేదు కాబట్టి ఆయన ఏం చెప్పాలని అనుకున్నారో అది చెప్పారు

    ReplyDelete
  13. @Anon at 23:24:- ekkada undi aa article..
    link ivvagalara. nenu check chesaanu, kaani dorakaledu

    ReplyDelete