Monday 18 July 2011

తిక్కలోల్లకు తిక్కలోడే కరెక్ట్ బలే కుదిరినాడు

   టి.జి.వెంకటేష్ స్టేట్‌మెంట్‌కి తెలంగాణ వాదులంతా ఓ................... అని తెగ నలుపుకుంటనారే ఏందబ్బా ఏమి జరిగినాది? అవును గాని నాకు తెలీక అడుగుతనా ఈ టి.జి.వెంకటేష్ ఏం తిట్టినాడని అట్లా అరుస్చనారే? అసలు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యుక్షులు ముక్కులోడు తిట్లకన్న అద్వానంగ తిట్టలేకపోయినాడేని నేను బాదపడ్తాంటే వీళ్ళేంది ఇట్లా గీరుకుంటనారు. అవును తెలంగాణ సాములు ఒక పెశ్న అడుగుతా జవాబు సెబ్తారా?
   మీ ముక్కోడు  సీమాంధ్రోల్లను ఎట్లబడ్తే అట్లన్యాడే గుర్తు రాలా? దొంగబాడ్కోవులన్న్యాడు. బొంద పెడ్తా దోపిడి దారులు అదేందో బాగో జాగో అన్న్యాడు గుర్తు రాలా నాకు హింధి సరిగ్గా రాదులే ఏమనుకోకాండి ఇంగ సీమాంద్రలున తరిమి తరిమి కొడ్తామని బో అర్సినారు. సాయుధ ధళం ఏర్పాటు సేస్చనాం అని కూడ సెప్పిండ్లా మీముక్కోడు? మూర్ఖంగా మాట్లాడనామని అప్పుడు గుర్తురాలేదా? అప్పుడూ మీలాగ మేము ఈడ ఏమి నలుపుకోలాబ్బా. ఎదురు తిట్లు కూడ తిట్ల్యా. మీరు అన్ని అన్న్యా కూడ మేము అన్ని భరించినాము. మీలాగ ఆవేశపడ్ల మరెందుకు అట్లా గీరుకుంటనారు?  మీ ముక్కులోడులాగే  ఈ టి.జివెంకటేష్ కూడ పెద్ద తిక్కలోడు అసలు ఈయప్పని రాయలసీమలో ఎవ్రూ లీడర్‌గా జమకట్టరు. లెఖ్క కూడ జేయరు అట్టాంటోడు మీరు బాగా పట్టించుకున్యారే..బాగా సరిపోయిందిపోండి మీ ముక్కు తిక్కలోడికి కరెక్ట్ మొగుడు ఈ టి.జి తిక్కలోడు. ఇంగ  మీ ముక్కులోడి సంగతి   పెద్ద జాదు మాకు తెల్సు సెంద్రబాబు మంత్రి పదవి ఇయ్యకుంటే ఆడ్నుంచి బయటకొచ్చి పార్టి పెట్టిండ్లా ఇంగెట్ల గొప్ప నాయకుడు అయితాడు? ఆ సంగతంతా మాకు తెల్సు మా బుర్రలో మట్టి లేదబ్బా.
  అవునూ శ్రీకాంతాచారని ఒక పెద్ద మూర్ఖశిఖామణి ఉండాడు బ్లాగుల్లో ఆయప్ప అడిగే క్వశ్చన్స్ సూడండి ఎట్లా ఉండాయో?
" సమైక్యవాదమంటే పొరుగు ప్రాంతంలో ముష్కర మూకలను ఉసిగొల్పి భయభ్రాంతుల్ని చెయ్యడమన్న మాట! పదవుల్ని అడ్డం పెట్టుకొని ఉద్యమాలు చేస్తున్న ప్రజల్ని జైల్లలో తోసి రాక్షసంగా అణచి వెయ్యడమన్న మాట. సమక్యవాద సిద్ధాంతమే వేరొక ప్రాంతంపై దోపిడీ, గుత్తాధిపత్యాన్ని లక్ష్యాలుగా చేసుకొని ఊపిరి పోసుకున్నప్పుడు వారి ఆలోచనలు ఇంతకన్నా గొప్పగా ఉంటాయనుకోవడం ముర్ఖత్వమే. "

   మీరు సేసింది ఏందప్పా? మీరు మాట్లాడింది ఏంది సెప్పు? మీ ముక్కోడు సాయుధదళాలను స్తాపిస్తా అన్నెప్పుడూ ఏమయ్యింది మీ తెలంగాణ వాదం? మమ్మల్ని దోపిడి దారులనడం గొప్పనా? మమ్మల్ని తరిమి తరిమి కొడ్తాం అనడం గొప్పనా ఏంది? మీ తెలివి కాకులెత్తుకెల్లా ఎవ్రు సెప్పినారు సమైఖ్యవాదమంటే వేరొక ప్రాంతాన్ని దోపిడీ సేయడమని? మీ ముక్కోడు సెబ్తే అదే కరెక్టా? ల్యాక తెలంగాణ పజలంతా మంచోళ్ళు, నిజాయితీ పరులు, ఒకరిజోలికి పోరు. సానా బుద్దిమంతులు ఒక్క సీమంద్ర పజలే దొంగలు దోపిడి దారులు లఫంగా వెదవలు అని దేవుడు సెప్పినాడా? ల్యాక మీ ముక్కోడు సెబ్తే అదే నిజమయితాదా? పెపంచంలో యాడన్నా ఇట్లా ఏకపక్షంగా ఉంటాదా సెప్పండి ఎవ్రున్నా. ఒకే ఒక పాంతంలో మాత్రమే మంచోళ్ళు ఉండి దాని సుట్టూ పెపంచంలో చెడ్డోళ్ళు  ఉండేకి అయితాదా? ఎవ్రున్న వచ్చి న్యాయం సెప్పండబ్బా?
  
  ఇంగా ఈ హెచ్చరిక సూడండి
  " టీజీ, బతకడానికి నువ్విక్కడికొచ్చావు గానీ, మేం నీదగ్గరికి రాలేదని తెలుసుకో. "
  ఏంది హైదరాబాద్ మీ ఒక్కరి సొత్తా? అట్లయితే ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కాప్టెల్ సిటి ఎందుకు సేసినారు? అక్కడికొచ్చినారంటే అది తెలుగోళ్ళ రాజధాని కాబట్టి వచ్చినారు ఏ కర్నాటక రాజధానికో తమిళనాడు రాజధానికో పోలా కదా? రాజధాని మీ ఏరియాలో ఉంది కాబట్టి మా దగ్గరికి వచ్చినారనంటే మీ అంత మూర్ఖులు ఎవ్రూ వుండారబ్బా..? అదే రాజధాని కర్నూల్ ఉండుంటే వైజాగోళ్ళు సర్కారోళ్ళు తెలంగాణోళ్ళు కూడ కర్నూల్ రాజధానికే బతకడానికి వచ్చేటోళ్ళు కదా? అప్పుడూ మేము కూడ మీరన్నట్లే బతకడానికి మీరు మాదగ్గరికొచ్చినారంటే కరెక్ట్ అయితాదా? సెప్పు ? అదే రాజధాని ఏ వైజాగో ల్యాక విజయవాడో అయ్యుంటే అందరు ఆ రాజధానికే పోవాల బతకడానికి అట్లా పోయినోళ్ళు బతకడానికొచ్చినారంటే ఎవ్రూ మూర్ఖులు అయితారబ్బి? ఇప్పుడూ నీవు మూర్ఖుడు అయినావు కదా? ఒక సారి నీ వీపు నీవే సూస్కో తెలుస్చాది.
   ఈ భూమి నీది కాదు నాది కాదు బతికినన్నాళ్ళు ఉంటాము ఆయుష్షు తీరినాక పోతాము దీనికే బో మిడిసి పడ్తనారే తెలంగాణ వాదులంతా? అసలు ఈ భూమిని ఎట్లా భాగాలుగా పంచుక్ఉన్యారో తెలుసా అని.  నిజాం రాజు ఎవడబ్బు సొమ్మని రాయలసీమను "సీడడ్" పేరు పెట్టి బ్రిటీష్ దొరలకు అమ్మినాడు?  1770లో జరిగిన 3వ మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఓడిపోయినాడు అప్పుడు బ్రిటీషోళ్ళకు నిజాం నవాబుకు సంధి జరిగిందిలే దాంతో రాయలసీమ మళ్ళీ నిజాంకు దక్కింది. నిజాం నవాబు మరాఠాలకు సర్దేశముఖిలకు పన్నులు బలంతంగా సెల్లించేవాడు. ఇంగ మరాఠాలనుండి నిజాం రక్షించుకోల్యాకపోయినాడు. వాళ్ళ పోరు పడల్యాక 1800లో బ్రిటీషోళ్ళతో సైన్యసహకార సంధి సేసుకొని మరాఠాలు దాడి సేస్చే ఆయప్పకు రక్షణగా బ్రిటీషోళ్ళు సహాయం సేయాలి దానికి ప్రతిఫలంగా రాయలసీమను బ్రిటేఏషోళ్ళకు దత్తతకు ఇచ్చేసినాడు. మేమేమన్న వస్తువులమా ఏంది? ఎవడబ్బ సొమ్మని? వాడికేమన్న బానిసలమా మేము. లాస్ట్‌కి దత్త మండలాలు అని పేరు పెట్టినారులే. ఇంత సంగతి వుంది దీని వెనుక మీరేమో మాది మాది అంటారు ఇంతకు ఈ భూమి ఎవర్దబ్బా?
    అయినా ఏమన్యాడనీ టి.జి మీద బో పన్నారు? తెలంగాణ హోం మంత్రి కాబట్టి ఆమెకు ఇబ్బందులుంటాయి అదే నేనైతేనా విధ్వంసకారులని జైళ్ళొ పడేసేవాడ్ని అన్యాడు అంతే కదూ! యాడ ఉద్యమకారుల్ని జైళ్ళో పెడ్తానని అన్లేదే ? రాజకీయంగా ఉద్యమాల్ని సేసుకొండి సెప్పినాడు ఇంగయాడన్నాడు ఉద్యమం సేసే పజల్ని జైళ్ళో పెడ్తానని? ఏమన్న తెలంగాణ వాదుల్ని మీ ముక్కొడిలాగ దోపిడి దారులని దొంగబాడ్కోవలని తిట్టినాడా ఏంది సెప్పండ్రి? ఊర్కే లొల్లి సేస్చనారు. రోంత కూడ మీమీద ఎవ్రూ అనకూడదా. ఎవ్రన్న మిమ్మల్ని రోంత సిన్న ఇమర్శ గుడ్క సేయకూడదు సేస్చే సాలు బో పొడుసుకొస్చాదే పౌరుషం? మీకేనా పౌరుషం మాకులేదా? మేము మనుషులం కాదా? మీరేమో మమ్మల్ని దోపిడి దొంగలు. లఫింగిగాళ్ళంటే ఊరికే పడుండాలా? మీ అంత గొప్పోళ్ళు మంచోళ్ళు పెపంచంలో ఎవ్రూ లేరా ఏంది? సూడు మీ తెలంగాణ కవులు ఎట్లా తిడ్తనారో మమ్మల్ని సూడ్లేదా? ఒక కవేమో మమ్మల్ని ఆంధ్ర కీటకం అంటాడు మరొకడు " దెంగేయ్ " అన్యాడు ఇంగొకడు ఒగలెందుకురా నగదు దొంగల్లారా! అన్యాడు. బొండిగ పిసుకుతం అంటా! మరో గాడిదకొడుకు ఎడం కాలుతో తంతా! అంటా ! ఏది తన్నమను సూద్దాం? మీరో మేమో ఉండాల ఇంగ సూస్కుందాం.

  ఊర్కొండే కొద్దీ బో రెచ్చిపోతనారు మీరు మాత్రమే మొనగాళ్ళా ఏంది? మాకు సేతకాదా..ఈడ ఎవ్రూ గాజులు తొడ్కోని లేరు మీది పోరాటాల గడ్డ అయితే ఏంది గొప్ప మాది కూడ పౌరుషాల గడ్డ ఎవ్రూ సేతనయితే వారు సూసుకుందాం రండి. మాకు బుద్ది సెప్పి గూడ్సులో కర్నూల్‌కి పంపుతారట..రాండి తాడో పేడో తేల్చుకుందాము ఎవ్రి సేతనయితే వాల్లే మిగులుతారు.

13 comments:

  1. Superb! Great analysis.

    ReplyDelete
  2. perfect reply.. chaachi kottinatlu undi

    ReplyDelete
  3. ఇంకా మీ బతుకులు ఇంథె ఇలా అనందపడి బతుకాలి........

    ReplyDelete
  4. cool down guys. Emotions valla problems solve kavu

    ReplyDelete
  5. సూడు మూడో అనానిమస్. మా బతుకులు మీద జాలి పడింది సాల్లే గాని మీ బతుకులు సూస్కొపోర్రి ముందు. ఎప్పుడూ ఒకరిమీద పడి ఏడ్వడమే కదా మీ పని..! మీ ఆగడాలు సూసినాల్లు సూస్చాం ఏదో ఒకరోజున మాకు తిక్క రేగుతాది అంతే మాడి మసి అయిపోతారు మీరు.

    ReplyDelete
  6. కేకో కేక బ్రదర్
    అందరు లోపల అనుకునేది నువ్వు బయటకు సెప్పినావు
    అడ్డమైన కూతలు కూసే నాయాల్లకు మెట్టు తో కొట్టినట్లున్నాది
    GOOD COMENTS AND GREAT ANALYSIS
    ఇట్లు
    ప్రొద్దటూర్ పోరగాడు

    ReplyDelete
  7. ఈ రాజకీయ ఉద్యమం వల్ల తెలంగాణ ప్రాంతంలోని సామాన్యులు ముఖ్యంగా విధ్యార్థులు ఎంత నష్టపోతున్నారో గమనించండి

    ReplyDelete
  8. ఇదిగో కేకో కేకో అనానిమస్ బదరూ బాగానే సెప్పినావు గాని మెట్టు సెప్పుల పదాలు వాడగాకబ్బి, సంస్కారం కాదు మనల్ని ఇంగా యేలెత్తి సూపుతారు. మీది పొద్దుటూరా?నాది మీ పక్కూరే జమడక్క

    ReplyDelete
  9. అబ్బా ఇంత మంది అనానిమసులంటే ఎట్లా రిప్లై ఇయ్యాలి పేరు రాయండి ధైర్యం లేదా? అన్నా విధ్యార్థులు నష్టపోతున్నారంటే దానికి కారణం ఎవ్రంటావు సెప్పు? స్టూడెంట్స్‌ని రెచ్చగొట్టి వాళ్ళను సేతులారా సంపి ఆ సెంటిమెంట్‌ని అడ్డం పెట్కోని అమరవీరులని సెప్పుకుంటూ సింపతీ సంపాయించే వాళ్ళను అడగాలన్నా ఈ పెశ్నలు.

    ReplyDelete
  10. ooruko anna. morige kukkalu karavavu anna.

    ReplyDelete
  11. anna manchiga seppundaavu. okka paali malla gurthaka thechuko anna. morige kukkalu eppatiki karavavu anna. eedila kukkalu moriginayyi ani intiki vachchi badha padtamaa enti.

    ReplyDelete
  12. మొరిగే కుక్కలు సామెతలెందుకబ్బి?ఈడ సెప్పిన విషయం వదిలేసి ఏందేందో మాట్లాడతారే. అట్నే కానిలే మొరిగే కుక్కలు కరుచ్చాయో లేదో సూస్చావులే అబ్బి కాలంఇంగా సాన వుంది

    ReplyDelete
  13. Please change the background color as white or in some light color as we could not read

    ReplyDelete